విజయవాడలో సైకోహల్చల్.. మహిళపై దాడి చేస్తుండగా బుద్ధిచెప్పిన స్థానికులు

-

ఏపీలోని విజయవాడలో లా అండ్ ఆర్డర్ అదుపుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.విజయవాడ పాతబస్తీలొని వించిపేటలో ఓ సైకోహల్చల్ చేశాడు.పాతబస్తీలో గల పంజా సెంటర్‌కి సమీపంలో ఉండే నైజాంగేట్ సెంటర్ వద్ద ఓ సైకో స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తూ అలజడి సృష్టించాడు. ఈ క్రమంలోనే వించి పేటలో టిఫిన్ బండి నడుపుకునే స్థానిక మహిళ సరుకుల కోసం దుకాణానికి వెళ్లగా.. ఒక్కసారిగా ఆమె మీద దాడి చెయ్యబోయాడు.

దీంతో ఆ మహిళ భయంతో పరుగులు తీస్తుండగా.. గమనించిన స్థానికులు దుండగుడిని పట్టుకొని పక్కనే ఉన్న స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు.అయితే, ఇదే సైకో గ్రూపునకు చెందిన మరొక వ్యక్తి అర్దరాత్రి 2 గంటలకు అసిఫ్ అనే స్థానికుడిపై అతి కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. పెద్దగా అరుపులు వినపడటంతో పక్కనే ఉన్న ఇళ్లలో నుంచి మనుషులు బయటకు రావటంతో అక్కడ నుండి సైకో పరారైనట్లు సమాచారం.గాయాల పాలైన అసిఫ్‌ను దగ్గరలో ఉన్న ఒక ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. నిన్న లోకోపైలట్ హత్య జరిగి 24 గంటలు గడవక ముందే వెనువెంటనే 2 ఘటనలు జరగటంతో విజయవాడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news