ప్రముఖ మొబైల్ గేమ్ పబ్‌జి మొబైల్‌పై హ్యాకర్లు దాడి చేశారు. ఆ గేమ్‌పై డీడీఓఎస్ (డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్-ఆఫ్-సర్వీస్) అటాక్‌లను హ్యాకర్లు మొదలు పెట్టారు. ఈ మేరకు ఈ విషయాన్ని పబ్‌జి గేమ్ డెవలపర్లు తాజాగా వెల్లడించారు. ఈ క్రమంలో ప్రస్తుతం గేమ్ సరిగ్గా పనిచేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి.
పబ్‌జి మొబైల్ గేమ్‌ను గత నెలలో భారత్‌లో బ్యాన్ చేశారు. దీంతో ఈ గేమ్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో యూజర్లకు అందుబాటులో లేదు. అయినప్పటికీ దీన్ని ఐఎస్‌పీలు ఇంకా బ్యాన్ చేయలేదు. దీంతో గేమ్‌ను బ్యాన్ చేసేటప్పటికే ఇన్‌స్టాల్ చేసుకుని ఉన్న యూజర్లు ఇప్పటికీ ఈ గేమ్‌ను ఆడుతున్నారు. అయితే ఈ గేమ్‌పై తాజాగా హ్యాకర్లు దాడి చేయడం సంచలనం సృష్టిస్తోంది.
అయితే హ్యాకర్ల దాడి విషయాన్ని గుర్తించిన పబ్‌జి డెవలపర్లు ప్రస్తుతం ఆ దాడులను తిప్పికొట్టే పనిలో పడ్డారు. అయితే ఈ సమస్య ఎప్పటి వరకు పరిష్కారం అవుతుందో పబ్‌జి డెవలపర్లు వెల్లడించలేదు. కానీ ఈ దాడుల వల్ల పబ్‌జి ఆడుతున్న యూజర్లు గేమ్ మాటి మాటికీ డిస్‌కనెక్ట్ అవుతున్నట్లు మాత్రం గుర్తించి ఫిర్యాదు చేస్తున్నారు. కాగా ఇండియాలో పబ్‌జి గేమ్‌పై నిషేధాన్ని ఎత్తివేయించడం కోసం ఆ గేమ్ డెవలపర్లు ఇప్పటికే టెన్సెంట్ గేమ్స్‌తో భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నారు. అయినప్పటికీ గేమ్ మళ్లీ భారత్‌లో అందుబాటులోకి వస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా ప్రస్తుతం హ్యాకర్ల దాడి వల్ల పబ్‌జి మొబైల్ సమస్యలను ఎదుర్కొంటుండడంతో గేమ్ ముందు ముందు ఎలా పనిచేస్తుందనే దానిపై అనేక అనుమానాలు నెలకొంటున్నాయి.