డిప్యూటీ సీఎంల‌కు ప్ర‌జ‌ల మార్కులు ఇవేనా… నెటిజ‌న్లు ఏమంటున్నారు…?

-

ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వంపై గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. కేబినెట్‌లో మంత్రుల ప‌నితీరు ఎలా ఉంద‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. నిజానికి సీఎంగా తాను ప్ర‌మాణం చేసిన నాడే.. నాకు ఆ రు మాసాల గ‌డువు ఇవ్వండి.. నేనేంటో నిరూపించుకుంటాను.. అంటూ .. జ‌గ‌న్ ఆనాడు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు ప‌క్క‌న పెడితే.. అస‌లు జ‌గ‌న్ కేబినెట్‌పై ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నా రు ? అనే ప్ర‌శ్న తెర‌మీద‌కి వ‌స్తోంది. దీనిని ప‌రిశీలిస్తే.. ఆస‌క్తికర విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. మొ త్తం జ‌గ‌న్ కేబినెట్‌లో సీఎంతో క‌లిపి 26 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు.

ఇక‌, మొత్తం కేబినెట్‌లో మ‌హిళా మంత్రుల సంఖ్య 3. వీరిలో ఒక‌రు డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. దీంతో జ‌గ‌న్ కేబినెట్‌లో డిప్యూటీ ముఖ్య‌మంత్రులు ఏం చేస్తున్నార‌నే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యం గా నేడు ప్ర‌తి విష‌యానికీ కూడా రేటింగ్ ఇస్తున్నారు కాబ‌ట్టి జ‌గ‌న్ కేబినెట్‌పై ఆన్‌లైన్ మీడియా సంస్థ ఒక‌టి ఇటీవ‌ల రేటింగ్ నిర్వ‌హించింది. దీనిలో నెటిజ‌న్లు విరివిగా తమ అభిప్రాయాల‌ను పంచుకున్నారు. ఈ క్ర‌మంలో సీఎం స‌హామంత్రుల ప‌నితీరు, వారికి ల‌భించిన రేటింగ్ ఆశ్చ‌ర్య‌క‌రంగాను ఆలోచింపజేసేది కాను ఉండ‌డం గ‌మ‌నార్హం.

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి:  సీఎం.. అత్యంత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూ.. సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ.. ముందుకు సాగుతున్న నాయ‌కుడిగా ప్ర‌జ‌లు ఆయ‌న‌ను గుర్తించారు. ఎక్క‌డా వెన్ను చూప‌కుండా అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుడుతూ.. అన్ని వ‌ర్గాల‌కు ప‌థ‌కాల‌ను చేరువ చేస్తున్న నాయ‌కుడిగా ఆయ‌న‌ను భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో గ‌డిచిన ఆరు మాసాల్లో ఆయ‌న‌కు 8/10 మార్కులు ఇస్తున్నారు.

పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌:  పార్టీకి, సీఎంకు అత్యంత విధేయుడైన డిప్యూటీ ముఖ్యమంత్రిగా గుర్తింపు సాధించారు. రెవెన్యూ శాఖ‌లో అవినీతిపై పోరాటం చేస్తున్నారు. నిబ‌ద్ధ‌త‌తో త‌న‌కు అప్ప‌గించిన ప‌నిని చేయ‌డంలో నిమ‌గ్న‌మ‌య్యారు. వివాదాల‌కు క‌డు దూరంగా ప‌నిచేస్తున్నారు. సంచ‌ల‌నాలు లేక‌పోయినా.. ఎక్క‌డా వివాదాల‌కు మాత్రం కేంద్రం కాకుండా చూసుకుంటున్నారు. దీంతో ఆయ‌కు 5/10 మార్కులు వ‌చ్చాయి.

కె.నారాయ‌ణ స్వామి: ఎస్సీ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిగా ఉన్న నారాయ‌ణ స్వామికి జ‌గ‌న్ డిప్యూటీ సీఎంగా ప‌ద‌వి ఇచ్చారు. ఎక్సైజ్ మంత్రిగాఆయ‌న కీల‌క బాధ్య‌త‌లు చూస్తున్నారు. ఈయ‌న కూడా అవినీతికి దూరంగా ఉంటూ.. మ‌ద్య నిషేధం దిశ‌గా గ‌ట్టిగానే ప‌నిచేస్తున్నారు. అయితే, ఈయన కూడా ప్ర‌చారాల‌కు దూరంగా ఉంటున్నారు. ఇటీవ‌ల అసెంబ్లీలో చంద్ర‌బాబును ఆయ‌న పార్టీ నాయ‌కుల‌ను ఇరుకున పెట్టి ప్ర‌భుత్వానికి పెద్ద‌పీట వేశారు. దీంతోఈయ‌న‌కు కూడా 5/10 మార్కులు వ‌చ్చాయి.

ఆళ్ల నాని: జ‌గ‌న్‌కు అత్యంత విశ్వాస పాత్రుడిగా పేరు తెచ్చుకున్న కాళృకృష్ణ శ్రీనివాస్‌.. ఉర‌ఫ్ నాని.. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. వివాదాల‌కు దూరంగా ఉంటున్నా.. ప్ర‌భుత్వ వైద్య‌శాల‌ల‌పై ప‌ట్టుకోల్పోతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈయ‌న ప‌నితీరుపై జ‌గ‌న్ కూడా స‌మీక్ష చేస్తున్నార‌ని అంటున్నారు. పెద్ద‌గా దూకుడు లేక‌పోయినా.. ప‌నితీరులోనూ అదే రీతిగా ఉండ‌డం ఆయ‌న‌కు రేటింగ్‌ను భారీగా త‌గ్గించి 4/10కి ప‌రిమితం చేసింది.

పుష్ప శ్రీవాణి: జ‌గ‌న్ కుటుంబానికి ప్రాణం ఇచ్చే నాయ‌కురాలిగా పేరున్న గిరిజ‌న నాయ‌కురాలు పుష్ప శ్రీవాణికి జ‌గ‌న్ డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అదేస‌మ‌యంలో గిరిజ‌న సంక్షేమ శాఖ‌ను అప్ప‌గించారు. అయితే, ఆమె ప‌నితీరు ఇప్ప‌టికీ మెరుగుప‌డ‌లేద‌ని పార్టీలోనే చ‌ర్చ న‌డుస్తోంది. దీంతో ఆమెకు కేవ‌లం 3/10 మార్కులే రావ‌డం గ‌మ‌నార్హం.

అంజాద్ బాషా:  జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌కే చెందిన బాషాకు జ‌గ‌న్ డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు ఇస్తూనే మైనార్టీ సంక్షేమ శాఖ‌ను కేటాయించారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న దూకుడుగా వ్య‌వ‌హ‌రించింది ఏమీ లేదు. స‌న్మానాలు, స‌త్కారాల‌కు ప్రాధాన్యం ఇస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి రాష్ట్రంలో స‌గం మందికి కూడా ఆయ‌న ప‌రిచ‌యంలేరంటే.. ఆయ‌న ప‌నితీరు ఎలా ఉందో అర్ధ‌మ‌వుతుంది. దీంతో ఆయ‌న‌కు కూడా 3/10 మార్కులే రావ‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version