అనసూయ, రేష్మీకి పోటీగా పునర్నవి…?

-

పునర్నవి భూపాలం’ బిగ్ బాస్ 3 తర్వాత ఈ తెలుగు అమ్మాయి సోషల్ మీడియా సంచలనం. సోషల్ మీడియాలో క్రమంగా ఈ పిల్లకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈమె సినిమాలు చేస్తే బాగుంటుంది అనే డిమాండ్ కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వినపడిన సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు సినిమాల్లో కనపడినా సరే ఈమెకు మాత్రం గుర్తింపు చాలా తక్కువగా వచ్చింది అనేది వాస్తవం.

ఇప్పుడు ఈ అమ్మాయి యాంకర్ అవ్వాలని కోరుకుంటున్నారు అభిమానులు. వాస్తవానికి ఈ పాప చాలా చలాకీగా ఉంటుంది. తెలుగు కూడా చాలా చక్కగా ముద్దుముద్దుగా మాట్లాడుతుంది. మంచి స్మైల్, యాక్టివ్ గా ఉండటంతో యాంకర్ కి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయని అంటున్నారు. పొట్టిగా ఉందనే గాని యాంకర్ కి ఉండాల్సిన లక్షణాలు అన్నీ కూడా ఈ అమ్మాయికి ఉన్నాయి.

 

ప్రస్తుతం ఈటీవిలో వచ్చే ఒక కొత్త షోకి ఈమె యాంకర్ గా చేస్తే బాగుంటుంది అంటున్నారు. షో నిర్మాతలు ఆమెను యాంకర్ గా అంగీకరించాలి అని కోరుతున్నారు. ప్రస్తుతం టాప్ యాంకర్లుగా ఉన్న అనసూయ రేష్మీలకు ఈ అమ్మాయి కచ్చితంగా పోటీ ఇస్తుందని, అవకాశం ఇస్తే తక్కువ కాలంలోనే మంచి యాంకర్ అవుతుందని అంటున్నారు. ఇక సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా ఆమెకు కలిసి వస్తుందని ఆమె చేసే షో కి మంచి ఆదరణ వస్తుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news