సంగారెడ్డి కరోనా కల్లోలం.. ఒకే కాలేజీలో 43 మంది విద్యార్థులకు పాజిటివ్‌

-

సంగారెడ్డి జిల్లాలో మహాత్మ జ్యోతిరావు పూలే కాలేజీలో కరోనా మహమ్మారి కలకలం రేపింది. ఏకంగా 43 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ముత్తంగి గ్రామంలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే ఇంటర్ కాలేజ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ కాలేజీ లో ఇంట్మీడియట్, టెన్త్ తరగతులతో కలిపి మొత్తం విద్యార్థులు 520 మంది ఉన్నారు.

ఇందులో నిన్న చేసిన కరోనా పరీక్షల్లో.. ఏకంగా… 43 మంది విద్యార్థులు అలాగే… ఒక లెక్చరర్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీంతో కరోనా సోకిన వారిని కాలేజీ లోనే ఐసోలేషల్ లో ఉంచి.. చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇక ఈ 43 మంది విద్యార్థులతో ఈ మధ్య బాగా క్లోజ్‌ గా తిరిగిన వారికి మరోసారి కరోనా పరీక్షలు చేస్తున్నారు అధికారులు. కాగా…. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజు కు తగ్గుముఖం పడుతున్నాయి. ఇక ఓమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ వైద్య శాఖ అలర్ట్‌ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news