పూణెకు చెందిన 60 ఏళ్ల ఓ ఆటోడ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు. అసలే కరోనా కష్టకాలం. ప్రతి ఒక్కరికీ ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ అతను తనకు దొరికిన ఆ బ్యాగులో ఉన్న నగలు, నగదును ముట్టలేదు. వాటి విలువ మొత్తం రూ.7 లక్షలు ఉంటుంది. ఈ క్రమంలో ఆ బ్యాగును తిరిగి దాని ఓనర్‌కు ఇచ్చేసి నిజాయితీని చాటుకున్నాడు.
పూణెలో నివాసం ఉండే విఠల్ మపారె ఆటోడ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. తాజాగా ఇతను అక్కడి కేశవనగర్ అనే ప్రాంతంలో తన ఆటోలో ఓ జంటను ఎక్కించుకుని వారిని హదప్సర్ బస్ స్టాండ్ దింపేశాడు. అనంతరం బీటీ కవాడె రోడ్ వద్ద తన ఆటోను రహదారి పక్కన ఆపి టీ తాగసాగాడు. అయితే ఆటోలో చూడగా అతనికి ఓ బ్యాగ్ కనిపించింది. ఆ బ్యాగ్ ఆ దంపతులదే అయి ఉంటుందని అతను భావించాడు. దాన్ని అతను ఓపెన్ చేయకుండా సమీపంలో ఉన్న ఓ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ విజయ్ కదంకు అప్పగించాడు.
అయితే ఎస్ఐ విజయ్ హదప్సర్ పోలీస్ స్టేషన్‌ను ఆ బ్యాగు నిమిత్తమై ఫోన్‌లో సంప్రదించాడు. కాగా అప్పటికే ఆ స్టేషన్‌లో సదరు దంపతులు తమ బ్యాగ్ పోయిందని కంప్లెయింట్ ఇచ్చి అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న ఎస్ఐ విజయ్ సదరు ఆటోడ్రైవర్ విఠల్‌తో కలిసి ఆ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి దంపతులు మహబూబ్, షహనాజ్ షేక్‌లకు వారి బ్యాగును వారికి అప్పగించారు. ఈ క్రమంలో వారు బ్యాగ్‌ను ఓపెన్ చేసి చెక్ చేసుకుని అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయని చెప్పారు. అనంతరం ఆటో డ్రైవర్ విఠల్‌ను అక్కడి డీసీపీ సుహాస్ బవ్‌చే సన్మానించారు. తమ బ్యాగ్‌ను యథావిధిగా తిరిగి అప్పగించినందుకు ఆ దంపతులు విఠల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఆ బ్యాగులో నగలు, నగదు కలిపి మొత్తం రూ.7 లక్షల విలువ ఉంటుంది. కాగా ఆ ఆటోడ్రైవర్‌ను స్థానికులే కాదు, నెటిజన్లు కూడా అభినందిస్తున్నారు.