Puneeth Rajkumar : “అప్పుకు అంకితం” పునీత్‌ రాజ్‌ కుమార్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌..

-

Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన మర‌ణ‌వార్తను అభిమానులతో పాటు సినీ, ఇత‌ర‌ సెలబ్రిటీలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయ‌న‌ మరణ వార్త అబద్ధమ‌యితే.. బాగుండు అని ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ అయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు ఎంతో మంది న‌టులు.

తాజాగా పునీత్ భార్య అశ్విని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా.. ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. ఇప్పటివరకు యాక్టివ్‌గా ఉండని ఆమె అకౌంట్‌ ఓపెన్‌ చేసి మరీ మొదటి పోస్టును పునీత్‌ రాజ్ కుమార్‌కు అంకితమిచ్చారు.
‘శ్రీ పునీత్‌ రాజ్‌ కుమార్‌ అకాల మరణం కేవ‌లం మా కుటుంబానికే కాదు. దేశ‌వ్యాప్తంగా ఉన్న ఆయ‌న అభిమానుల‌కు షాకింగ్‌గా ఉంది.

ఆయన్ను ‘పవర్ స్టార్‌’ చేసిన త‌న అభిమాన లోకానికి కూడా తీర‌ని లోటు. ఈ స‌మ‌యంలో .. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా, మ‌నో నిబ్బ‌రంతో గౌరవంగా ఆయ‌న‌కు వీడ్కోలు పలికారు. ఇత‌ర‌ విదేశాల నుంచి ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చారు. అప్పు (పునీత్‌ రాజ్‌ కుమార్‌)ని వేలాది మంది ఫాలో అవ్వడం, ఆయనలా నేత్రదానానికి ముందుకు రావడం, మీ మనసులో అప్పుకు ఉన్న స్థానం చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయన‍్ను ఆదర్శంగా తీసుకొని.. మీరు చేసే మంచి పనుల్లో పునీత్‌ జీవించే ఉంటారు. మీ ప్రేమ, మద్దతు కోసం మా మొత్తం కుటుంబం తరఫున అభిమానులకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇట్లు, అశ్విని పునీత్‌ రాజ్‌కుమార్ అంటూ రాసుకోచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news