ఈ బ్యాంక్ కస్టమర్స్ కి హెచ్చరిక… వచ్చే నెల నుండి ఈ సేవలు బంద్..!

-

మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఖాతా ఉందా..? అయితే తప్పక మీరు ఈ విషయాలని తెలుసుకోవాలి. దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNB కస్టమర్లను అలర్ట్ చేసింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. PNB కస్టమర్లను అలర్ట్ చేసింది. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తాయని తెలియజేయడం జరిగింది.

 

ఇక ఆ రూల్స్ ని చూస్తే.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇక పాత చెక్ బుక్స్ పని చేయవని వెల్లడించింది. ఈ విషయాన్ని కస్టమర్స్ గమనించాలని పేర్కొంది. ఇది ఇలా ఉంటే ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ OBC, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ బుక్స్ చెల్లవని పీఎన్‌బీ చెప్పింది. అయితే ఈ కొత్త రూల్స్ అక్టోబర్ 1 నుంచి వస్తాయని తెలిపారు.

అందుకే బ్యాంక్ కస్టమర్స్ ని కొత్త చెక్ బుక్స్ తీసుకోవాలని చెప్పారు. లేదంటే చెక్ బుక్ ట్రాన్సాక్షన్లు నిర్వహించలేరు. చెక్ ద్వారా చెల్లింపులు చేయడం కుదరదు. అదే విధంగా ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనమైన విషయం తెలిసిందే. అందువల్ల పీఎన్‌బీ నుంచి కస్టమర్లు కొత్త చెక్ బుక్స్ పొందాలి. వీటిల్లో ఐఎఫ్ఎస్‌సీ కోడ్, ఎంఐసీఆర్ కోడ్ వంటివి కొత్తవి ఉంటాయి. 18001802222 నెంబర్‌కు కాల్ చేసి వివరాలనాన్ని తెలుసుకొచ్చు. పైన పేర్కొన్న రెండు బ్యాంకుల కస్టమర్లు వారి పాత చెక్ బుక్స్‌ను కొత్త చెక్ బుక్స్‌తో మార్చుకోవాలి. సెప్టెంబర్ నెల చివరిలోపు చెక్ బుక్స్ ని తీసుకోవాలి అని బ్యాంక్ అంది.

Read more RELATED
Recommended to you

Latest news