Pushpa The Rule : పుష్ప2 నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసిందోచ్..

-

వచ్చేసింది.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. చాలా రోజులుగా పుష్ప 2 సినిమా నుంచి కనీసం ఒక అప్డేట్​ అయినా వస్తే బాగుండు అని ఎదురుచూస్తున్న అభిమానులను ఎట్టకేలకు ఆ చిత్రబృందం ఖుష్ చేసింది. తాజాగా పుష్ప- ది రూల్​కు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్​తో ముందుకొచ్చింది.

#WhereIsPushpa అంటూ సాగే చిన్న వీడియోను చిత్రబృందం ఇవాళ రిలీజ్ చేసింది. తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప.. అనే డైలాగ్​తో ఈ వీడియో స్టార్ట్ అయింది. అసలు పుష్ప ఎక్కడంటూ సూపర్ పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్​తో వీడియో ఎండ్ అయింది. 20 సెకన్ల వీడియోను రిలీజ్ చేసిన పుష్ప టీమ్.. పుష్ప ది రూల్​ కంటే అసలు వేట ఏప్రిల్ 7వ తేదీన సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేస్తామని చివరలో ప్రకటించింది.

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన్న హీరోగా రిలీజ్ అయిన పుష్ప – ది రైజ్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ స్టోరీకి ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. దీనికి సీక్వెల్​గా పుష్ప ది రూల్​ను సుకుమార్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version