ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప – 2 సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పూర్తి కావస్తోంది. క్లైమాక్స్ షాట్ లను ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ డైరెక్షన్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందించడానికి సిద్ధమవుతోంది. ఈ మధ్యనే ఈ సినిమా నుండి విడుదలైన గింప్స్ వీడియో అంచనాలను మరింత పెంచేసింది. పుష్ప పార్ట్ 1 లో ఫహద్ ఫాజిల్ లో పోలీస్ గా చివర్లో వచ్చి ఎంత ఆకట్టుకున్నాడో తెలిసిందే. పార్ట్ 2 లో అయితే పూర్తి స్థాయిలో ఇతని పాత్ర ఉంటుంది.