pushpa : ‘పుష్ప’ ఐటమ్ సాంగ్ రిలీజ్.. మావా.. అంటూ దుమ్ము లేపిన సమంత

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో టాలీవుడ్ సంచలన డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన నటిస్తోంది. అలాగే ఫాహద్ ఫాజిల్ ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ లో నటిస్తుండగా… సునీల్, జబర్దస్త్ యాంకర్ అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా… మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తోంది చిత్రబృందం. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ లు, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలోనే పుష్ప నుంచి మరో అప్డేట్ వచ్చింది. సమంత నటించిన పుష్ప ఐటమ్ సాంగ్ విడుదల చేసింది చిత్ర బృందం. ” ఊ అంటావా.. ఊ హు  అంటావా ” అంటూ సాగే ఐటెం సాంగ్.. విడుదల అయిన కాసేపటికే.. యు ట్యూబు ను షేక్ చేస్తోంది. ఇక ఈ సాంగ్ లో… సమంత తన అందాలను ఆరబోసింది. అటు ఈ ఐటమ్ సాంగ్ లిరిక్స్ కూడా.. అందరికీ ఊపును తెప్పిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version