పుష్ప 2 సినిమా ట్విస్ట్ లే ట్విస్టులు..!!

-

అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన‘పుష్ప’ సినిమా ఊహించని  వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో పాటలు , స్టైల్స్ అన్ని విపరీతంగా ఆదరణ పొందాయి.చాలా మంది క్రికెటర్లు కూడా పుష్ప మ్యానరిజంతో ఎన్నో వీడియోలు చేశారు. రీసెంట్ గా ఈ సినిమా ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు పుష్ప 2కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు పుష్ప 2 స్క్రిప్ట్ కోసం సుకుమార్ చాలా టైమ్ కేటాయించి పనిచేశారు. ఈ సారి కేజీఫ్ కంటే ఎక్కువ మోతాదులో ట్విస్టులు మరియు యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టుకున్నారట.అయితే రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. వచ్చే నెలలో విడుదల  అయ్యే అవతార్ 2 సినిమా థియేటర్స్ లో విడుదల కోసం చిన్న టీజర్  ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తో భారత దేశం మొత్తం థియేటర్స్ లో రీచ్ అయ్యే అవకాశం ఉంది.

అయితే ఈ సినిమా కోసం మరో అందాల భామ ను లైన్ లో పెట్టాలని చూస్తున్నారట.ఆమె నే డిజే టిల్లు లో నల్ల చీర లో కుర్రాళ్ల మతులు పోగొట్టిన నేహా శెట్టి . పుష్ప 2 లో ఓ పాత్ర కి నేహా శెట్టిని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సినిమా లో బన్నీ-నేహా మద్య మంచి రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయట. శ్రీ వల్లి పాత్ర చనిపోయిన తర్వాత  పుష్ప ఈమెతో గడిపే అవకాశం వున్నట్లు లీకులు అందుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news