టోక్యో ఒలంపిక్స్ : చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. వశమైన కాంస్య పతకం

-

టోక్యో ఒలంపిక్స్ లో తెలుగు తేజం పివి సింధు తన జోరు కొనసాగిస్తుంది. ఒలింపిక్స్ లో కాంస్య పతకం  కోసం జరుగుతున్న ఉత్కంఠ పోరులో… భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు అదరగొట్టింది. ఈ రసవత్తర పోరులో చైనా కు చెందిన ప్లేయర్ బింగ్జియావోపై పీవీ సింధూ అద్బుత విజయం సాధించింది. ఇక ఈ గెలుపుతో తెలుగు తేజం పివి సింధు కాంస్యం గెలుచుకుంది.

మొదటి సెట్ లో దీటుగా ఆడిన పీవీ సింధు రెండో సెట్లో మాత్రం కాస్త తడబడింది. రెండో సెట్ లో పీవీ సింధు మరియు చైనా ప్లేయర్ జియవో ఇద్దరూ హోరాహోరీగా ఆడారు. కానీ ఎట్టకేలకు జీయావో పై  21 -15 తేడాతో రెండో సెట్ లోనూ పీవీ సింధు ఘన విజయం సాధించింది. ఈ విజయం తో కాంస్యం గెలుచుకుని టోక్యో ఒలంపిక్స్ లో చరిత్ర సృష్టించింది పీవీ సింధు. ఇక అంతకు ముందు తొలి సెట్ లో పీవీ సింధు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. తొలి సెట్ లో 21-13 తేడాతో చైనా క్రీడాకారిణి పై…. పీవీ సింధు సునాయాసంగా గెలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news