నేటి అసెంబ్లీ అజెండా గురించి కీలక అప్డేట్ వచ్చింది. నేడు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు అయ్యాయి. ఇక సభలో నేరుగా రైతు భరోసాపై చర్చ జరుగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. దీంతో సభ్యులు అందరూ రైతు భరోసా నిధుల విడుదల మాట్లాడనున్నారు.
అటు రైతు భరోసా నిధుల కోసం రైతులు చాలా ఎదురు చూస్తున్నారు. ఇక అటు నిన్న ఎమ్మెల్యే హరీష్ రావు ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొరడాతో కొడతాడని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. నేను హరీష్ రావు గారి బాధను అర్థం చేసుకోగలనని అన్నారు. అసెంబ్లీలో హరీష్ రావు అల్లరి చేసి చొక్కాలు చించుకోకపోతే.. ఇంటికి వెళ్లిన తరువాత కొరడా దెబ్బలు ఉంటాయని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో నువ్వు ఏం చేస్తున్నావని హరీష్ రావు ని కేసీఆర్ అడుగుతారని.. కొడుకు విషయంలో కెసిఆర్ సీరియస్ గా ఉంటారని అన్నారు.