మనలోకం. ఇటీవలి నిర్వహించిన్ ఆన్‌లైన సర్వేకు మంచి స్పందన లభించింది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కోసం చేసి ఈసర్వేకు తొలి రోజు పోటా పోటీగా మొదలైంది. తమ నాయకుడు గెలవాలంటూ అభిమానులు సోషల్ మీడియాలో పిలుపునివ్వగా సర్వే రసవత్తరంగా సాగింది. ఈ లిస్టులో తొలి నుండి వెనుక పడ్డ నాయకుడు కూన ప్రతాప్ గౌడ్. తొలి రోజు కూన శ్రీశైలం గౌడ్ కూడా నెమ్మదిగా ఉన్నా కానీ రెండో రోజు పర్వాలేదనిపించుకున్నారు. మిగిలిన ఇద్దరు అభ్యర్థులు కూన వివేకానంద గౌడ్, కొలన్ హన్మంత్ రెడ్డి..
తొలి రోజు నుండే టీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌ఛార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి అభిమానులు హవా నడిపించారు. ఇక ప్రస్తుత ఎమ్మెల్యే రెండో స్థానం కోసం మాత్రమే పోటీ పడ్డట్టు కనిపించారు. ఇక ముందుగా అనుకున్నట్టు ౩ రోజులకే ఆపేయాలనుకున్నా వివేక్ అభిమానుల కోరిక మేరకు రెండు రోజులు పెంచిన ఫలితం మాత్రం కొలన్ దూకుడే కొనసాగింది.
ఇక సర్వేలో 24032 మంది పాల్గొన్నారు. కూన ప్రతాప్ గౌడ్‌కు 24 ఓట్లు పోల్ అవగా, కూన వివేకానంద్ గౌడ్‌కి 2593, కూన శ్రీశైలం గౌడ్‌కి 3520 ఓట్లు, కొలన్ హన్మంత్ రెడ్డికి 17896 ఓట్లు పడ్డాయి. పర్సెంటీజీలో చూస్తే 74.4 శాతం ఓట్లు కొలన్‌కు రావడం గమనార్హం.
ఎమ్మెల్యేగా ఉండి కూడా అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంలో విఫలం చెందడం, పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవడమేనని టాక్… మొత్తానికి ఈ సర్వే విజేత కుత్బుల్లాపూర్ టీఆర్‌ఎస్ పార్టీ ఇంఛార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి..