కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క‌ను క‌లిసిన ఆర్ నారాయ‌ణ మూర్తి

ములుగు నియోజ‌క వ‌ర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క‌ను పీపుల్స్ స్టార్ ఆర్ నారాయ‌ణ మూర్తి గురు వారం సమావేశం అయ్యారు. ఈ సంద‌ర్భం సీత‌క్క, ఆర్ నారాయ‌ణ మూర్తి తెలంగాణ రాజ‌కీయాల పై కాసేపు ముచ్చ‌టించారు. అలాగే పీపుల్స్ స్టార్ ఆర్ నారాయ‌న మూర్తి ప్ర‌ధాన పాత్ర లో వ‌చ్చిన రైత‌న్న సినిమా ను చూడాల్సిందిగా ఎమ్మెల్యే సీత‌క్క‌ను కోరాడు. అయితే ఆర్ నారాయ‌న మూర్తి రైత‌న్న అనే సినిమా కు ద‌ర్శ‌క‌త్వం తో పాటు నిర్మాత‌గా, సంగీత ద‌ర్శ‌కునిగా వ్యవ‌హ‌రించాడు.

అలాగే ఈ సినిమా లో ప్ర‌ధాన పాత్ర‌లో ఆర్ నారాయ‌ణ మూర్తి నటించాడు. అయితే ఈ సినిమా ను కేంద్ర ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళ‌న కు మ‌ద్ద‌త్తు గా ఈ సినిమా ను తీశాడు. అయితే ఈ సినిమాను ఈ ఏడాది లోనే అగ‌ష్టు నెల‌లో విడుద‌ల అయింది. అయితే ఈ సినిమా ను విక్షించాల‌ని ఆర్ నారాయ‌ణ మూర్తి ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది రాజ‌కీయా వేత్త‌లను క‌లిసాడు. అందులో భాగంగానే ములుగు ఎమ్మెల్యే సీత‌క్క‌ను కూడా క‌లిసార‌ని తెలుస్తుంది.