NBK107 నుంచి బిగ్ అప్డేట్.. హీరోయిన్ గా క్రాక్ బ్యూటీ!

-

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా… గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజాం ఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాను రూపొందించడానికి కథను సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి.

ఈ సినిమా కు సంబంధించిన స్క్రిప్టు కూడా పూర్తయిందని సమాచారం. ఇంకా ఈ సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో తెరకెక్కుతోంది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా టైటిల్ పై అనేక రూమర్స్ వచ్చాయి. ఇదిలా ఉండగా ఈ నేపథ్యంలో దీపావళి నేపథ్యంలో ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో క్రాక్ బ్యూటీ శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు శృతిహాసన్ పోస్టర్ ను కూడా వదిలింది చిత్రం. ప్రస్తుతం సలార్ మూవీ లో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news