ప్రపంచంలోనే మొదటిసారిగా కరోనా చికిత్స కోసం టాబ్లెట్ లు అందుబాటులోకి వచ్చాయి. మోల్న్ పిరవిర్ అనే టాబ్లెట్ లను మెర్క్ ఫార్మా కంపెనీ తయారు చేయగా బ్రిటన్ ప్రభుత్వం ఈ టాబ్లెట్ లకు అనుమతులు ఇచ్చింది. కరోనా పై ఈ టాబ్లెట్లు సమర్థవంతంగా పనిచేస్తాయని కరోనా మహమ్మారి బారిన పడ్డవారు రోజుకు రెండుసార్లు ఈ టాబ్లెట్లను వేసుకోవాలని సూచించారు. ఇక ఇప్పటికే మెర్క్ సంస్థ కరోనా టాబ్లెట్ ల అనుమతుల కోసం అమెరికా ప్రభత్వానికి కూడా ధరకాస్తు చేసుకుంది.
అయితే ఆ దరఖాస్తు పెండిగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ టాబ్లెట్ త్వరలోనే మనదేశంలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు కరోనా కు సరైన టాబ్లెట్ లేదు అన్న సంగతి తెలిసిందే. దాంతో ఇతర వ్యాధులకు ఉపయోగించే మందులనే కరోనా నివారణ లో ఉపయోగిస్తున్నారు. ఇలాంటి సమయం లో కరోనా కు టాబ్లెట్ వస్తుంది అంటే అది సంజీవని లా చెప్పుకోవాల్సిందే.