అందాల రాశి.. టాప్​ లేపేసి.. కుర్రాళ్లకు ఊపు తెప్పించి

-

టాలీవుడ్ బ్యూటీ రాశీఖన్నా.. ‘ఊహ‌లు గుస‌గుస‌లాడే’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ సూప‌ర్ హిట్ అందుకుని త‌న అందం, న‌ట‌న‌తో వ‌రుస ఆఫ‌ర్లు ద‌క్కించుకుంది. అయితే అంత‌కుముందే రాశీఖన్నా మ‌ద్రాస్ కేఫ్ అనే సినిమాలో న‌టించినా అంత‌గా గుర్తింపు రాలేదు. తెలుగులో నాగ‌శౌర్య హీరోగా న‌టించిన ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రం తర్వాత వ‌రుస పెట్టి సినిమాలు చేసింది. గోపిచంద్ స‌ర‌స‌న‌ జిల్, ర‌వితేజ‌తో బెంగాల్ టైగ‌ర్, సందీప్ కిష‌న్ తో జోరు, వ‌రుణ్ తేజ్ తో తొలిప్రేమ‌, ఎన్టీఆర్ తో జైల‌వ‌కుశ‌, ప్ర‌తిరోజు పండ‌గే, వెంకీమామ‌లో న‌గ‌చైత‌న్య‌కు జోడీగా, హైప‌ర్, వ‌ర‌ల్డ్ ఫెమ‌స్ ల‌వ‌ర్, రీసెంట్​గా గోపిచంద్​తో పక్కా కమర్షియల్, నాగచైతన్యతో థ్యాంక్యూ​ వంటి చిత్రాల్లో న‌టించి మంచి మార్కుల కొట్టేసింది. .

మొద‌ట్లో ఎక్కువ‌మ‌ట్టుకూ సాంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో ఉండే పాత్ర‌ల‌కే ప్రాధాన్య‌త‌నిచ్చింది. ప్ర‌స్తుతం గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు ప్రాధాన్యత ఇస్తోంది ఈ భామ‌. కెరీర్ మొద‌ట్లో కొద్దిగా బొద్దుగా ముద్దుగా ఉండే ఈ భామ స్లిమ్​గా మారిపోయి ఫిట్​నెస్​పై పూర్తి దృష్టి సారించింది. ఇక తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం హిందీలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే బాలీవుడ్ వెబ్ సిరీస్ రుద్ర‌లో కూడా న‌టించి ప్రశంసలను అందుకుంది.

కాగా ర‌శీఖన్నా ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొక వైపు సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తుంది. ఫోటో షూట్ లతో కుర్రకారుకు అందాల కనువిందు చేస్తుంది. ఎద అందాల‌తో మెస్మ‌రైజ్ చేస్తోంది. టాప్ అందాలను చూపిస్తూ కవ్విస్తోంది. అవి ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి. వాటిని మీరూ చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news