కరోనా వ్యాక్సిన్ లు ఇవ్వడంలో డాక్టర్లు, ఆరోగ్య సింబ్బంది కృషి మరవలేనిది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఆరోగ్య సిబ్భంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వ్యాక్సిన్ లు వేసుకునేవారిని ప్రమాదంలో నెట్టివేస్తుంది. ఇటీవల ఓ బామ్మకు ఒకే సారి నర్స్ రెండు డోసుల వ్యాక్సిన్ వేసి వార్తల్లో నిలిచింది. ఇక మరో ఘటనలో అసలు వ్యాక్సిన్ మందు తీసుకోకుండానే కాళీ ఇంజెక్షన్ ను వ్యక్తికి ఎక్కించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
ఇక తాజాగా కరోనా వ్యాక్సిన్ కోసం వెళ్లిన ఓ వ్యక్తికి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ను వేశారు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకుంది. మహరాష్ట్ర థానే లోని కల్వా ఏరియాలో ఓ వ్యక్తి కోవిడ్ వ్యాక్సిన్ కోసం వెళితే డాక్టర్ నర్సు కలిసి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేశారు. ఈ వార్త బయటకు రావడంతో డాక్టర్ మరియు నర్సును విధుల్లో ఉండి తొలిగిస్తూ వైద్యాధికారులు నిర్ణయం తీసుకున్నారు.