BREAKING : సీఐ నాగేశ్వర్ రావును అరెస్ట్ చేసిన రాచకొండ ఎస్ఓటి పోలీసులు

-

సీఐ నాగేశ్వర్ రావును అరెస్ట్ చేశారు రాచకొండ ఎస్ఓటి పోలీసులు. సరూర్ నగర్ ఎస్ఓటి ఆఫీసులో నాగేశ్వర్ రావును ప్రశ్నిస్తున్నారు ఏసీపీ పురుషోత్తం రెడ్డి. అత్యాచారం, కిడ్నాప్, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన వనస్థలిపురం పోలీసులు.. ఆయనను విచారణ చేస్తున్నారు. గత రెండేళ్లుగా బాధిత మహిళను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు.

సిఐ పై కేసు నమోదు అయిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు నాగేశ్వర్ రావు. బాధితురాలను, భర్తను బలవంతంగా ఇబ్రహీంపట్నం ఎల్మి నేడు కు తీసుకెళ్తుండగా ప్రమాదానికి గురైన కారు… ఈ ప్రమాదంలో సీఐ నాగేశ్వర్ రావు భుజం కు బలమైన గాయమైనట్లు గుర్తించారు పోలీసులు. ప్రమాదం తర్వాత సీఐ నుండి బాధితురాలతో పాటు భర్త తప్పించుకొని వచ్చి వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సెక్షన్ 452 , 376 (2) , 307, 448, 365 ఐపీసీ , Arms Act సెక్షన్ 30 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version