గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. ఫాన్స్ లోకం ఫిదా..!

-

ప్రముఖ కొరియోగ్రాఫర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా మారిన రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో చిత్రాలలో నటించి అటు తమిళ్ ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన ఈయన ఇటీవల రుద్రుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. ఇదివరకే ఈ సినిమాను తమిళంలో రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు తెలుగులో కూడా సినిమాను రిలీజ్ చేసి సక్సెస్ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు రాఘవ లారెన్స్.

వాస్తవానికి రాఘవ లారెన్స్ చిత్రాలు అంటే దెయ్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారుతూ ఉంటాయి.. మరి రుద్రుడు సినిమాతో ఆయన ఎలా ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమవుతున్నారు అన్నది కాన్సెప్ట్ .. ఇదిలా ఉండగా తాజాగా మరొకసారి తన గొప్ప మనసును చాటుకున్నారు రాఘవ లారెన్స్. చిరంజీవి అభిమాని అయిన ఈయన.. ఆయన దారిలోనే నడుస్తున్నాను అంటూ వెల్లడించారు.. తాజాగా తాను 150 మంది పిల్లలను ఉచితంగా చదివిస్తున్నాను అంటూ తెలిపారు. ఇటీవల రుద్రుడు సినిమా ఆడియో లాంచ్ లో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది..నేను 150 మంది పిల్లలకు మంచి విద్యను అందించబోతున్నాను.. నాకు మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ రాఘవ లారెన్స్ తెలిపారు.

ఆధ్యాత్మికంగా, సాంఘిక పరంగా తన సేవలను అందించడంలో లారెన్స్ ఎప్పుడు ముందుంటారు.. గతంలో కూడా ఎంతోమందికి ఉచిత ఆపరేషన్లు చేయించారు . అలాగే ఆయన తన తల్లి కోరిక మేరకు రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని కూడా నిర్మించారు.ఇప్పుడు చిన్నారుల పట్ల చూపిస్తున్న శ్రద్ధకు నెటిజన్లు నీరాజనాలు పలుకుతున్నారు. ఏది ఏమైనా ఇంత చిన్న వయసులోనే అంత గొప్ప మనసు చాటుకుంటున్నారు అంటూ ఫాన్స్ లోకం ఫిదా అవుతోంది. ఇకపోతే ఈయన నటించిన రుద్రుడు సినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news