కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోలేదా..? కేటీఆర్ కి రఘు నందన్ కౌంటర్..!

-

నేను సరే కానీ మీ మామ కామారెడ్డి లో ఓడిపోలేదని మాజీ మంత్రి హరీష్ రావుకి బిజెపి మెదక్ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. దుబ్బాక లోని ఓడిపోయిన రఘునందన్ రావు ఎలా గెలుస్తాడని దుష్ప్రచారం చేస్తున్న హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కామారెడ్డిలో బిజెపి అభ్యర్థి చేతిలో ఓటమిపాలైన విషయాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు.

శుక్రవారం నంగనూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తర్వాత మండల పరిధిలోని కోనాయిపల్లి భాష గూడెం తిమ్మాయపల్లి నర్మెట్ట నంగనూరు మండల కేంద్రం దాకా బైక్ ర్యాలీని నిర్వహించారు. అయిన ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి అభ్యర్థి పై ఓడిపోయిన కేసీఆర్ ని తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారని ఎద్దేవా చేశారు. 30 ఏళ్లుగా సిద్ధిపేట నియోజకవర్గం ఒకే కుటుంబం చేతిలో బంధీగా ఉందని అన్నారు. అవినీతికి నిదర్శనం కవిత తీహార్ జైలుకు వెళ్లడమేనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news