ఒక రాజధానికే డబ్బుల్లేవు, 3 రాజధానులు కావాలా?’ అంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. అమరావతికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ సందర్భంగా పై విధంగా స్పందించారు. ఈనెల 27 వరకు స్టేటస్ కో ఉత్తర్వులు అమల్లో ఉంటాయంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ‘ఇది అంతం కాదు.. ఆరంభం’ అని అన్నారు. 3 రాజధానుల అభివృద్ధికి ప్రభుత్వం వద్ద నిధులున్నాయా? అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రానికి ఆర్థిక ప్రణాళిక లేకపోతే ఎలా అంటూ ప్రభుత్వాన్ని రఘురామ ప్రశ్నించారు. బాటా పాదరక్షల రేటులా కేంద్రాన్ని రూ. 9.9 లక్షల కోట్లు అడుగుతున్నారని విమర్శించారు. నిర్మాణ సంస్థలకు రూ. వేల కోట్ల బిల్లులు ఇవ్వాలని.. కేంద్రం ఇచ్చిన డబ్బు చెల్లించకపోతే రేపో మాపో వారంతా ఢిల్లీలో ధర్నా చేస్తారన్నారు.ఒక సామాజికవర్గం నాయకులు తనపై మాటల దాడి చేస్తున్నారని.. తనను ఫోన్లో బెదిరించేది ఆ వర్గం వారే అని ఎంపీ ఆరోపించారు. బెదిరింపు కాల్స్‌పై న్యాయం జరుగుతుందని నమ్మకం లేదన్నారు. జగన్ బొమ్మతో తాను గెలవలేదు కనుక రాజీనామా చేయనని స్పష్టంచేశారు.