బిగ్ బ్రేకింగ్: రఘురామ కృష్ణం రాజుకి బెయిల్ మంజూరు

-

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఉదయం నుంచి కూడా వాదనలు విన్న సుప్రీం కోర్ట్ బెయిల్ పిటీషన్ ని వాదించే అర్హత సుప్రీం కోర్ట్ కి ఉందంటూ స్పష్టం చేసింది. కింది కోర్ట్ కి వెళ్ళమని హైకోర్ట్ చెప్పినా డైరెక్ట్ గా సుప్రీం కోర్ట్ కి వచ్చారని, అది కరెక్ట్ కాదని ప్రభుత్వ తరుపు న్యాయవాది వాదనలు వినిపించినా.. సుప్రీం కోర్ట్ ఏకీభవించలేదు.

ఈ కేసుకి సంబంధించి మీడియాతో మాట్లాడకూడదు అని షరతు విధించింది. ధర్యాప్తుని ప్రభావితం చేయకూడదు అని స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి విచారణకు పిలిస్తే వెళ్ళాలి అని, దర్యాప్తు న్యాయవాది సమక్షంలో జరగాలి అంటూ కూడా సుప్రీం కోర్ట్ తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. ఇద్దరు జామీను దారులతో సొంత పూచీకత్తు, లక్ష రూపాయల షూరిటితో గుంటూరు సి ఐ డీ కోర్ట్ లో వీటిని దాఖలు చేసి బెయిల్ తీసుకోవాలని సుప్రీం తీర్పులో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version