సక్సెస్ సీక్రెట్: ఆర్.ఆర్.ఆర్ కు వరంగా మారిన జగన్ సీక్రసీ!

-

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి – వైకాపాకు ఉన్న సమస్యలు అన్నీ ఒకెత్తు అయితే రఘురామకృష్ణం రాజు వ్యవహారం మరొకెత్తు! ఇటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలను గిల్లడం.. కాస్త అసహనంతో ఉన్న ఎమ్మెల్యేలను దువ్వడం.. హాస్తిన కేంద్రంగా పార్టీని గిచ్చడం.. వంటిపనులు వరుసపెట్టి చేస్తూనే… జగన్ అంటే ప్రాణం.. పార్టీ అంటే పిచ్చి అనేస్థాయిలో మాట్లాడుతున్నారు ఆర్.ఆర్.ఆర్.! పార్టీపైన అభిమానం జగన్ అంటే ప్రాణం అంటూ చెప్పే మాటలకు.. హస్తినలో చేస్తున్న పనులకూ పొంతన లేదు అని వినబడుతున్న మాటల సంగతి అలా ఉంచితే… కొత్త అస్త్రం ఒకటి ప్రయోగిస్తున్నారు ట్రిపుల్ ఆర్!

గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి సంబందించి తీసుకున్న నిర్ణయం ఏదైనా సరే… ఫైనల్ గా అది జరిగినా, జరగకపోయినా.. ప్రకటనలు మాత్రం బహు ఘనంగా ఉండేవి. ఇంకెంత వచ్చేసింది.. ఇంకెంత అయిపోయింది.. అన్నరేంజ్ లో కళ్లకు గ్రాఫిక్స్ తొడుకులు తొడిగేవారు! అయితే జగన్ సర్కార్ వచ్చిన అనంతరం.. సీక్రసీ ఎక్కువగా ఉంటోంది.. పబ్లిసిటీ తక్కువగా ఉంటుంది.. ఫలితం కూడా ఎక్కువగా ఉంటోంది.. ప్రస్తుతం ఇదే విషయం ఆర్.ఆర్.ఆర్. మనుగడకు అక్కరకొచ్చిందని చెబుతున్నారు!

మొన్న అల్లూరి సీతారామరాజు పేరు విషయంలో కూడా… జగన్ సర్కార్ రేపటి రోజున ప్రకటించబోతోన్న సమయంలో.. నేటి రోజున ఆర్.ఆర్.ఆర్. ముందే ప్రెస్ మీట్ పెట్టి డిమాడ్ చేశారు! ఇదే క్రమంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో అవకతవకలపై జగన్ చర్చించబోతున్నారన్న విషయం మెల్లగా జనాల్లోకి వచ్చేలోపు… తనకున్న ఒకవర్గం మీడియా సహాయంతో “అవకతవకలు జరిగాయి జగన్ గారు స్పందించాలి” అన్న రేంజ్ లో డిమాండ్ చేశారు! ఇదే క్రమంలో తాజాగా మరో డిమాడ్ ని వినిపిస్తున్నారు ఆర్.ఆర్.ఆర్.!

ఇప్పటికే పలు విషయాలపై జగన్‌ కు లేఖలు రాసిన ఆర్.ఆర్.ఆర్. తాజాగా.. రాష్ట్రంలోని గోశాల గురించి ఒక లేఖ రాశారు. “రాష్ట్రంలో గోశాల అభివృద్ధి కమీటీలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వైఎస్ సీఎంగా ఉన్న 2005లో గోశాల అభివృద్ధి కమీటీలు ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చారు. రాష్ట్ర పునర్విభజన జరిగిన తరువాత మళ్ళీ కమీటీలు వేయలేదు. ఆర్ధిక ఇబ్బందులు వలనే గత ఏడాది సింహాచలం పుణ్యక్షేత్రంలో మూడు ఆవులు చనిపోయాయి. ఆవులు, దూడలు సంరక్షణ హిందువుల హృదయాలకు దగ్గరగా ఉంటుంది. అన్నివర్గాలు, అధికారులతో కలిపి గోశాల అభివృద్ధి కమీటీలు ఏర్పాటు చేయాలి! అని లేఖలో పేర్కొన్నారు.

విచిత్రం ఏమిటంటే… ఈ విషయాలపై జగన్ సోమ, మంగళ వారాల్లో అధికారులతో చర్చించబోతున్నారని సంకేతాలు వస్తోన్న తరుణంలో.. ఒకటి రెండు రోజుల ముందే కరెక్ట్ గా ఆర్.ఆర్.ఆర్. స్పందించడం! ఇది జగన్ “సీక్రసీ” ఫలితమా… ప్రెస్ మీట్ లు పెట్టని ఫలమా… లేక పబ్లిసిటీ పిచ్చి లేని పనితనమా? ఏమో… ఆర్. ఆర్.ఆర్. కే తెలియాలని అంటున్నారు జగన్ ఫ్యాన్స్!

Read more RELATED
Recommended to you

Exit mobile version