ఈ ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పడానికి బాధగా ఉంది : రఘురామ

-

మరోసారి వైసీపీ ప్రభుత్వం వ్యంగ్యాస్త్రాలు సంధించారు వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు. తాజాగా ఆయన.. లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని విమర్శించారు అన్నారు. అంతేకాకుండా.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన బాధ్యత అన్నారు రఘురామ కృష్ణరాజు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని రఘురామ కృష్ణరాజు విమర్శించారు.

ఆర్థికంగా అతి దారుణమైన స్థాయికి రాష్ట్రాన్ని దిగజార్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పడానికి బాధగా ఉందన్నారు రఘురామ కృష్ణరాజు. అప్పుల ఊబిలోంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు. నెల నెలకు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారుతోందన్నారు రఘురామ కృష్ణరాజు. ఉద్యోగులకు ఏడు డీఏలు రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉందని.. ఈ మొత్తం దాదాపు 12వేల కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు రఘురామ కృష్ణరాజు. ఈ మొత్తాన్ని ఇప్పుడు ఇవ్వలేమని, ఉన్నప్పుడు ఇస్తామని ఉద్యోగులకు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు తనకు తెలిసిందన్నారు. అలాగే మాదకద్రవ్యాల అమ్మకాలలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం బాధకరమన్నారు రఘురామ కృష్ణరాజు రఘురామ కృష్ణరాజు.

Read more RELATED
Recommended to you

Exit mobile version