క్రికెట్ దిగ్గజానికి పుట్టిన రోజు జేజేలు…!

-

రాహుల్ ద్రావిడ్” టెస్ట్ క్రికెట్ కి అసలైన నిర్వచనం చెప్పిన అరుదైన ఆటగాడు. క్రికెట్ ని ఎలా ఎంజాయ్ చెయ్యాలో బహుశా ద్రావిడ్ కి తెలిసినంత అందంగా మరో ఆటగాడికి తెలియదు ఏమో. టీం ఇండియాకు దాదాపు 15 ఏళ్ళ పాటు సేవలు అందించిన ద్రావిడ్ పుట్టిన రోజు నేడు. అంతర్జాతీయ క్రికెట్ లో ప్రతీ దేశం కూడా అలాంటి ఆటగాడు మాకు ఉంటే బాగుండు అనే స్థాయిలో అతను ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.

1996 లో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన ద్రావిడ్ ఆ తర్వాత టీం ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సచిన్ వెలుగులో అతను కనపడకపోయినా, గంగూలి దూకుడు అతన్ని వెనక్కి నెట్టినా ద్రావిడ్ మాత్రం అంతర్జాతీయ క్రికెట్ లో తన స్థానాన్ని సైలెంట్ గానే నిలుపుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో 10000 పరుగులు పూర్తి చేసిన ఆరవ బ్యాట్స్‌మెన్ గా, వరుసగా 4 టెస్ట్ ఇన్నింగ్సులలో,

సెంచరీలు నమోదుచేసిన ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా, టెస్ట్ క్రికెట్‌లో అతి తక్కువ ఇన్నింగ్సులలో 9000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్ గా, టెస్టులు మరియు వన్డేలు రెండింటిలోనూ 10000 పరుగులు పూర్తిచేసిన మూడవ బ్యాట్స్‌మెన్ గా, వికెట్ కీపర్‌గా ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు పూర్తిచేసిన క్రికెటర్ గా, 2004 లో ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ద్రావిడ్ సాధించిన రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే.

ప్రస్తుతం యువ టీం ఇండియాకు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు ద్రావిడ్. 2004 లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు. ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డ్ కూడా ద్రావిడ్ సొంతం. వన్డే క్రికెట్‌లో 300పైగా భాగస్వామ్యాలను రెండు సార్లు నమోదుచేసిన ఏకైక బ్యాట్స్‌మెన్ గాను నిలిచాడు. మనలోకం తరుపున ద్రావిడ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరింత ప్రతిభ ఉన్న ఆటగాళ్లను టీం ఇండియాకు అందిస్తాడని ఆశిస్తున్నాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version