కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 4 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు రాహుల్ గాంధీ. మ్మం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు జనగర్జన సభకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్కడ్నించి హెలికాప్టర్ లో ఖమ్మం వచ్చారు.
హెలిప్యాడ్ నుంచి ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ సభావేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జనగర్జన సభలో రాహుల్ గాంధీ ఎన్నికల హామీలను ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, పైలేరియా, డయాలసిస్ రోగులకు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులకు రూ.4వేల పెన్షన్ అందిస్తామని రాహుల్ ప్రకటించారు.