నా వైద్య విద్య ప్రయాణంలో నిరంతరం నాకు ప్రేరణగా నిలిచింది : శ్రీలీల

-

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి పెళ్లి సందD అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది శ్రీ లీల. మొదటి సినిమాతో ఈమె పెద్దగా ప్రేక్షకులను మెప్పించ లేకపోయినా తదుపరి చిత్రం ధమాకాతో మాత్రం పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది. అద్భుతమైన డాన్స్ ఎనర్జీ లెవెల్స్ మాత్రమే కాకుండా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో శ్రీ లీల ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా తన నటనతో అందరిని ఫిదా చేసిన ఈమెకు చిత్ర పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.

 

అయితే.. డాక్టర్స్‌ డే సందర్భంగా.. ఈ యువ నటి తన తల్లితో ఉన్న ఫోటోను షేర్‌ చేస్తూ వైద్యులకు శుభాకాంక్షలు తెలిపింది. అయితే.. ఇన్‌స్టాలో..’నా సూపర్ విమెన్. నిబద్దత అంకిత భావం హార్డ్ వర్క్ ఉన్న మహిళ. నా వైద్య విద్య ప్రయాణంలో నిరంతరం నాకు ప్రేరణగా నిలిచింది. డాక్టర్స్ డే సందర్భంగా నిజమైన హీరోలు అందరికి శుభాకాంక్షలు’ అంటూ శ్రీ లీల పోస్ట్ పెట్టింది. ఈ ఫోటో పోస్ట్ కి 3.33 లక్షల మంది లైక్ చేయడం విశేషం.

నా సూపర్ విమెన్. నిబద్దత అంకిత భావం హార్డ్ వర్క్ ఉన్న మహిళ. నా వైద్య విద్య ప్రయాణంలో నిరంతరం నాకు ప్రేరణగా నిలిచింది. డాక్టర్స్ డే సందర్భంగా నిజమైన హీరోలు అందరికి శుభాకాంక్షలు అంటూ శ్రీ లీల పోస్ట్ పెట్టింది. ఈ ఫోటో పోస్ట్ కి 3.33 లక్షల మంది లైక్ చేయడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version