విదేశాలకు కరోనా వ్యాక్సిన్ ఎగుమతి మీద రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతిని రాహుల్ గాంధీ తప్పు పట్టారు. దేశ ప్రజలను ప్రమాదంలోకి నెట్టడం సమంజసమేనా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కరోనా ఉధృతి దశలో వ్యాక్సిన్ కొరత తీవ్రమైన సమస్య అని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఉత్సవం జరపాలని ప్రధాని పిలుపు ఇవ్వడం మీద రాహుల్ విమర్శలు గుప్పించారు. .
వ్యాక్సిన్ కొరత ఉందని రాష్ట్రాలు చెబుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని రాహుల్ విమర్శించారు. వివక్ష చూపకుండా అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలానే వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ వేయాలని కోరుతూ ప్రధానికి రాహుల్ గాంధీ లేఖ రాశారు. వెంటనే టీకాలు ఎగుమతి నిలిపేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఇతర వ్యాక్సిన్లను త్వరగా తీసుకు వచ్చేందుకు కృషి చేయాలన్నారు.