మరోసారి రాహుల్ గాంధీ ఎమోషనల్ ట్వీట్..!

-

గుజరాత్ లోని సూరత్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవం ఎన్నిక పై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మరో సారి చెబుతున్నా వినండి.. అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు. నియంత ముఖం దేశం ముందు మరోసారి బయట పడిందని, ప్రజల నాయకుడిని ఎన్నుకునే హక్కును హరించి వేయడంతో బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడంలో మరో అడుగు వేశారన్నారు.

మరో సారి చెబుతున్నాను.. ఇవి కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఎన్నికలు కావు.. దేశాన్ని రక్షించే ఎన్నికలు, రాజ్యాంగాన్ని పరిరక్షించే ఎన్నికలు అని ట్విట్టర్  (ఎక్స్) వేదికగా ప్రజలను హెచ్చరించారు. లోక్ సభ ఎన్నికల్లో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పార్లమెంట్ సెగ్మెంట్ కి మొత్తం 3 నామినేషన్లు రాగా.. అందులో పత్రాలు సరిగ్గా లేని కారణంగా కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మరో స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉండగా.. బీజేపీ  పెద్దల అభ్యర్థన మేరకు స్వతంత్ర అభ్యర్థి తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నాడు. దీంతో సూరత్ లో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి నియామకపత్రం అందజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version