ఉక్కు మహిళ అంటూ సమంతకు పవర్ఫుల్ మెసేజ్ పంపిన డైరెక్టర్..

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత క్రిస్మస్ వేడుకలు జరుపుకుంది అయితే ఈ సందర్భంగా ఆమెకు తన బెస్ట్ ఫ్రెండ్ సినిమా రాహుల్ రవీంద్రన్ తాజాగా స్పెషల్ గిఫ్ట్ను పంపించారు అంతేకాకుండా దీంతో పాటు ఓ పవర్ఫుల్ మెసేజ్ కూడా అందించారు దీన్ని తన ఇన్స్టా వేదికగా పంచుకుంది సమంత..

సమంత క్రిస్మస్ సందర్భంగా తన కోస్టార్ డైరెక్టర్ రాహుల్ రవీంద్ర నుంచి ఒక గిఫ్ట్ను అందుకుంది అంతేకాకుండా ఒక పవర్ఫుల్ మెసేజ్ కూడా అందుకోగా దీన్ని షేర్ చేసింది అంతేకాకుండా ఈ విషయానికి అతనికి థాంక్స్ తెలిపింది.. అందులో ఎముందంటే.. ‘చీకటితో కూడిన సొరంగం. కనుచూపు మేర అంతం లేదు. వెలుతురు ఆనవాళ్లు కూడా లేవు. అడుగులు భారంగా మారినా శక్తినంతా కూడదీసుకుని ముందుకే సాగుతావు.

భయాలు, సందేహాలు పక్కనబెట్టి సైనికుడిలా మారతావు. నువ్వు ఉక్కు మనిషివి. ఈ విజయం నీ జన్మహక్కు. నువు చీకట్లో నడుస్తూనే ఉండు. త్వరలోనే సూర్యుడు ప్రకాశవంతంగా ప్రకాశిస్తాడు. నువ్వు ఓడిపోవు. ఈ కష్టకాలాన్ని ధైర్యంగా దాటగల నీలాంటి యోధులే పోరాటంలో గెలుస్తారు…ఎందుకంటే ఏదీ నిన్ను ఓడించదు… మనుపటి కంటే, ఇంకెప్పటి కంటే కూడా మరింత బలంగా తయారుచేస్తుంది’ అని సమంతకు ధైర్యాన్నిచ్చాడు.

ప్రస్తుతం సమంత సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే అలాగే మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటుంది నాగచైతన్యతో విడాకుల అనంతరం మానసికంగా ఎన్నో ఒత్తిడ్లను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే వీటన్నిటి నుంచి బయటపడేందుకు ఆమెకు తన కుటుంబం స్నేహితులు అండగా నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news