అన్ స్టాపబుల్ షో: ప్రభాస్,పవన్ ఏంది సామి ఈ అరాచకం..!!

-

నందమూరి బాలకృష్ణ అంటే మాస్ కా బాప్,  అభిమానులకు తనని మొన్నటి దాకా థియేటర్స్ లోనే చూసే అవకాశం వుండేది. కాని తాను ప్రస్తుతం టాక్ షో, యాడ్స్ లో కూడా కనిపిస్తూ అలరిస్తున్నాడు. ఇక తన అభిమానులు కాని వారు కూడా అన్ స్టాపబుల్ షో  చూసి అందరూ జై బాలయ్య అంటూ గోల గోల చేస్తున్నారు. సీజన్ 1 ఓటిటి లలో రికార్డ్ మోత మోగించింది.

ఇప్పుడు సీజన్ 2 చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే జరిగిన ఎపిసోడ్స్ ఒక రేంజ్ లో ఉంటే ఇక వచ్చే ఎపిసోడ్స్ ప్రభంజనం సృష్టించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ప్రభాస్, గోపి చంద్ ఎపిసోడ్ ట్రైలర్ మాత్రమే చూపించినా యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఇది పాన్ ఇండియా లెవెల్లో ట్రెండింగ్ లో హల్చల్ చేసింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో మరో సారి అదిరిపోయేలా ఉంది.

పవన్ తో అన్నపూర్ణ స్టూడియోస్ లో అన్ స్టాపబుల్ షో  ఎపిసోడ్ షూటింగ్  మొదలయ్యింది. దీని కోసం అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద అభిమానులు హంగామా చేశారు. పవన్ కి బాలయ్య స్వాగతం పలకడం, ఆలింగనం చేసుకోవడం లాంటి దృశ్యాలు అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ అన్ స్టాపబుల్ షో సీజన్ 2 చాలా భారీగా జరుగుతోంది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ రావడంతో బిగ్గెస్ట్ అండ్ క్రేజీయెస్ట్ గా మారింది. థాంక్యూ పవన్ అంటూ అల్లు అరవింద్ కామెంట్స్ చేశారు. చూస్తూంటే కొత్త సంవత్సరం నుండి సంక్రాంతి పండుగ వరకు అలజడి జరిగే అవకాశం ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news