కేసీఆర్‌ను గద్దె దింపడమే తమ లక్ష్యం : రాహుల్ గాంధీ

-

తెలంగాణలో బీజేపీ నాయకులు కొన్నిరోజులు హడావుడి చేశారని, ఇప్పుడు మాత్రం చప్పుడు చేయకుండా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. వరంగల్ రుద్రమదేవి కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని, ఒకరు ఢిల్లీలో, ఇంకొకరు హైదరాబాద్‌లో పని చేస్తున్నారన్నారు. ఈ రెండు పార్టీలు ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయన్నారు. కొన్ని రోజులు హడావుడి చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు బీఆర్ఎస్ గెలుపు కోసం పని చేస్తున్నారన్నారు. లోక్ సభలో ఈ రెండు పార్టీలు కలిసిమెలిసి ఉండటం గమనించినట్లు చెప్పారు. కేంద్రంలోని అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిందన్నారు. ఇక మజ్లిస్… బీజేపీకి అనుకూలంగా అభ్యర్థులను నిలబెడుతుందని ఆరోపించారు. కేసీఆర్‌ను గద్దె దింపడమే తమ లక్ష్యమన్నారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై సంతకం పెడతామన్నారు.

కేసీఆర్, కేటీఆర్ చదవిని స్కూళ్లు, కాలేజీలు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టినవేనని రాహుల్ చురకలంటించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ రాకముందే హైదరాబాద్‌ను కాంగ్రెస్ ఐటీ కేపిటల్ చేసిందన్నారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు దొరల తెలంగా.. ప్రజలకు తెలంగాణకు మధ్య జరుగుతున్న పోరాటంగా రాహుల్ అభివర్ణించారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతిపనిలోనూ ఆ పార్టీ నేతల అవినీతి కనిపిస్తోందని రాహుల్ ఆరోపించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version