రాసి పెట్టుకోండి.. కేంద్రం వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకుంటుంది !

Join Our COmmunity

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాసి పెట్టుకోండి వ్యవసాయ చట్టాల్ని కేంద్ర ప్రభుత్వం తప్పకుండా వెనక్కి తీసుకోవాల్సి వస్తుందని ఆయన అన్నార్రు. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుందని ఆయన అన్నారు. అప్పటి వరకూ రైతులకు తమ మద్దతు ఉంటుందన్నారు. ఒకరిద్దరు పారిశ్రామిక వేత్తల కోసం.. కేంద్రప్రభుత్వం పనిచేస్తోందని రాహుల్‌ గాంధీ  విమర్శించారు.

ఇక తమిళనాడులో పొంగల్ పండుగ సందర్భంగా నిర్వహించే జల్లికట్టులో రాహుల్ గాంధీ సందడి చేశారు. మధురై జిల్లాలోని అవనియపురంలో ఈ ఉదయం జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. క్యాజువల్ డ్రెస్ లో జల్లికట్టు వేదికపై కనిపించిన రాహుల్ ఈ పోటీల్లో పాల్గొంటున్న వారిని ఉత్సాహపరిచారు. రాహుల్ రాకతో జల్లికట్టు ప్రాంగణంలో మరింత సందడి నెలకొంది. 

TOP STORIES

మీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో తడబడుతున్నారా? ఈ విషయాలు తెలుకోండి..

పెళ్ళి.. ఇద్దరి జీవితాలను ఒకటి చేసేది. ఇద్దరు వ్యక్తులను ఒకే దారిలో నడిపేది. మానవుడు అభివృద్ధి చెందుతున్న పరిణామ క్రమంలో పెళ్ళనేది అతడు సృష్టించుకున్న అత్యంత...