ఆ ఎమ్మెల్యేకి సవాల్ విసిరిన రాహుల్ సిప్లిగంజ్..

-

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా రాహుల్ సిప్లిగూంజ్ గెలిచిన సంగతి తెలిసిందే. మెగా స్టార్ చేతుల మీదుగా టైటిల్ అందుకున్న రాహుల్.. 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా గెలిచారు. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. రాహుల్ సిప్లిగంజ్ తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సవాల్ విసిరాడు. తొంద‌రప‌డి ఇదేదో రాజ‌కీయ స‌వాల్ అని మాత్రం అనుకోకండి. ఇటీవ‌ల ప్రముఖ యాంకర్ సుమ కనకాల గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా రాహుల్ సిప్లిగంజ్‌కు స‌వాల్ విసిరారు. దీంతో గ్రీన్ ఛాలెంజ్‌ ని స్వీకరించిన రాహుల్ తన వంతుగా మొక్కని నాటాడు.

ఆ త‌ర్వాత‌ నటుడు, దర్శకుడు విశ్వేక్ సేన్ , తరుణ్ భాస్కర్ తో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కి కూడా నామినేట్ చేసాడు రాహుల్. అలాగే ఈ సందర్భంగా రాహుల్ తనని ప్రకృతిని పరిచయం చేసిన సుమకి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌ కుమార్‌ కు ధన్యవాదాలు తెలిపాడు. అదే విధంగా.. తాను మొక్కని నాటిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

Read more RELATED
Recommended to you

Latest news