మెదక్‌లో కొట్టుకుపోయిన రైల్వే లైన్.. తప్పిన భారీ ప్రమాదం..రైతు సమయస్ఫూర్తితో

-

మెదక్‌లో రైల్వే లైన్ కొట్టుకుపోయింది. కుండపోత వర్షాల వల్ల.. శమ్నాపూర్ రైల్వే బ్రిడ్జ్ కింద భాగంలో భారీగా వరద వచ్చింది. ఈ వరద ఉధృతికి.. రైల్వే ట్రాక్ కింద భాగంలో కంకర రాళ్లు, మట్టి కొట్టుకుపోయాయి. గాల్లో తీగల్లా రైల్వే ట్రాక్ తేలియాడింది.. ఈ విషయాన్ని గుర్తించారు శేఖర్ అనే స్థానికుడు. పోలీసులకు, రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. రైళ్ల రాకపోకలు నిలిపివేశారు.

Railway line washed away in Medak a huge accident averted
Railway line washed away in Medak a huge accident averted

సికింద్రాబాద్- నిజామాబాద్, అక్కన్నపేట-మెదక్ మార్గంలో రైళ్లు నిలిపారు అధికారులు. ఒకవేళ ఇది గమనించకపోయి ఉంటే.. పెద్ద ప్రమాదమే జరిగేదని రైల్వే అధికారులు అంటున్నారు. శేఖర్ అనే స్థానికుడు రైతు అని చెబుతున్నారు. అతను సమాచారం ఇవ్వకుంటే ప్రమాదం జరిగేదట.

Read more RELATED
Recommended to you

Latest news