హైకోర్టులో పిన్నెల్లి బ్రదర్స్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టిడిపి నేతల జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరుల బెయిల్ పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిన్నెల్లి వెంకటరామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.

ఇటు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి.. ఈవీఎం బాక్సులు బద్దలు కొట్టిన కేసులో కూడా చిక్కుల్లో ఎదుర్కొంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో టిడిపి నేతల జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు.. ఊహించని షాక్ తగిలింది.