రైల్వే శాఖ కీలక నిర్ణయం..!

రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుండి రైల్వే బోగీలను అద్దెకు ఇచ్చేందుకు రైల్వే శాఖ రెడీ అవుతోంది. అంతే కాకుండా ఆసక్తి ఉన్న వాళ్ళు రైల్వే బోగీలను అద్దెకు తీసుకుని ఇష్టం వచ్చినట్టుగా ఆ బోగీలను మార్చుకోవచ్చు అని స్పష్టం చేసింది. ఇక రైల్వే బోగీల లీజు కాల పరిమితి ఐదేళ్ల నుండి జీవిత కాలం వరకు పొడిగించుకోవచ్చు అని స్పష్టం చేసింది.

కావాలనుకుంటే బోగీలను శాశ్వతంగా కూడా కొనేయవచ్చని తెలిపింది. రూట్లు,టారిఫ్ నిర్ణయాధికారం కూడా బోగీలను
అద్దెకు తీసుకున్నవారికే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ రైళ్ళను మత, పర్యాటక మరియు సాంస్కృతిక రైల్లుగా నడపవచ్చని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఇక రైల్వే శాక తీసుకున్న ఈ నిర్ణయం తో రైల్వే శాఖ ఆదాయం పెరిగే అవకాశం ఉంది.