తెలుగు రాష్ట్రాల్లో మరోమారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గులాబ్ తుఫాన్ తరువాత గత వారం రోజులుగా ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లో పొడి వాతావరణం నెలకొంది. తాజాగా ఈ నెల 10న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చిరస్తోంది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కర్ణాటక, రాయలసీమ మీదుగా ఏపీ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడి ఉంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఏపీ ప్రాంతాల్లో మోస్తారు నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో అల్పపీడన వల్ల మరింగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.