బీర్ తాగితే ఇన్ని లాభాలుంటాయా..తాగేవారు పక్కా తెలుసుకోవాలండోయ్..!

-

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం..ఈ విషయం మనందరికి చిన్నప్పటినుంచే తెలుసు. పరిమితంగా బీరు తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కొన్ని అధ్యయానాలు చెబుతున్నాయి. అవేంటే తెలుసుకుంటే..ఈ సారి మీరు సిట్టింగ్ వేసినప్పుడు ఎవరైనా ఎందుకురా అస్థమానం తాగుతావ్ అన్నప్పుడు వారికి సమాధానం చెప్పేయొచ్చు:)..అంతేకాదు.. ఈ లాభాలేంటే తెలిస్తే మీకు ఉపయోగపడొచ్చేమో కదా..!
 ఎక్కువగా తాగడం వల్ల ఎసోఫాగియల్ క్యాన్సర్, సిర్రోసిస్, ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ మితమైన మద్యపానం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీకు ఈ విషయం తెలుసా.. అసలు మద్యం ముట్టని టీటోటెల్లర్స్ కంటే.. మితంగా బీరు, సాధారణ ఆల్కహాల్ శాతం ఉండే డ్రింక్స్ తీసుకునే వారు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని పరిశోధనల్లో కనుగొన్నారు.
బీరులో శాంటోహుమోల్ అనే ప్రీనిలేటెడ్ పదార్థం ఉంటుంది. దానిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఇన్‌ఫెక్షియస్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల బీరు శరీర భాగాల్లో వాపును తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. తరచుగా బీరు తాగేవారికి గ్యాంగ్రేన్ వంటి అనారోగ్యాల ప్రమాదం తగ్గుతుంది.
మితంగా బీర్ తాగేవారికి కరోనరీ ఆర్టరీ వంటి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 20 నుంచి 40% తక్కువగా ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. బీరులో ఉండే హాప్స్ యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను ఆక్సిడేషన్ నుంచి కాపాడుతాయట. ఇవి అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బీరులో ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

బోన్స్ బలంగా ఉండటానికి కూడా..

సిలికాన్, విటమిన్ బి, బయోయాక్టివ్ పాలీఫెనాల్స్ వంటివన్నీ బీరులో ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తాయి. బీరులో ఫైబర్, లిపోప్రొటీన్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఫలితంగా తరచుగా బీరు తాగేవారిలో ధమనుల ఆరోగ్యం బాగుంటుందని అధ్యాయనాలు తేల్చాయి.
ఇతర హార్డ్ డ్రింక్స్‌తో పోలిస్తే, బీర్‌లో ఆల్కహాల్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. బీరులో 4 నుంచి 6శాతం ఆల్కహాల్ మాత్రమే ఉంటుంది. అయితే ఈ పర్సంటేజ్ బ్రాండ్‌ని బట్టి మారుతుంది. దీంతోపాటు బీరులో అతి తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఫలితంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం పెద్దగా ఉండదట. ఒక గ్లాస్ బీర్‌లో సుమారు 208 క్యాలరీలు ఉంటయాని అంచనా.

హ్యాంగోవర్ సమస్య కూడా తక్కువే..

ఎక్కువగా మద్యం తాగితే హ్యాంగోవర్ వస్తుంది. సాధారణంగా విస్కీ, బ్రాందీ వంటి హార్డ్ డ్రింక్‌తో ఎక్కువ మందికి హ్యాంగోవర్ అవుతుంది. వీటితో పోలిస్తే అదే మొత్తంలో బీర్ తాగడం వల్ల తక్కువ డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఫలితంగా హ్యాంగోవర్ వచ్చే అవకాశాలు తక్కువ అవుతాయి. అలాగని అతిగా బీరు తాగినా ప్రమాదమే.
 ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. బీర్లలో ఉండే శాంటోహుమోల్ అనే ఫ్లేవనాయిడ్లకు క్యాన్సర్‌కు కారణమయ్యే ఎంజైమ్‌లను నిరోధించే శక్తి ఉంటుంది. ఈ శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌ ఇతర అనారోగ్యాలను సైతం దూరం చేస్తుందట.
కిడ్నీలలో ఏర్పడే రాళ్లను విచ్ఛిన్నం చేయడానికి బీరు తోడ్పడుతుంది. ఈ వ్యర్థాలను మూత్రంతో పాటు బయటకు పంపేందుకు బీరు సాయం చేస్తుంది. అలాఅని మెడికల్ ట్రీట్‌మెంట్‌ చేసుకోకుండా ఈ పద్ధతి ప్రత్యామ్నాయంగా వాడాలని కాదు.
వైన్ లేదా స్పిరిట్స్ వంటి డ్రింక్స్ కంటే ఎక్కువ పరిమాణంలో బీర్ ఉంటుంది. సరదాగా స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేయటానికి బీర్ కంటే అనువైనది ఇంకోటిలేదు. కాబట్టి దీనివల్ల పెద్దగా అనర్థాలు ఉండవట. మీరు పరిమితికి మించి తాగనంతవరకూ అంతా మంచిగానే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version