అలర్ట్‌ : మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

-

ఏపీకి మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నాట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనము సగటు సముద్రమట్టం నుండి 3.1 కిమీ & 5.8 కిమీ మధ్య ఎత్తుతో దక్షిణం వైపు వంగి ఉండి ఇంకా కొనసాగుతోంది. వీటి ఫలితముగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు పేర్కొంది వాతావరణ శాఖ.


ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. మరియు భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. రేపు ,ఎల్లుండి, ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది . మరియు భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. రేపు, ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంటుంది . పెనుగాలులు 40కిమీ నుంచి 50కిమీ వరకు గరిష్టముగా 60కిమీ వరకు ఉత్తర కోస్తా తీరం వెంబడి వీచే అవకాశం ఉంటుంది.
రాయలసీమ : రాయలసీమ లో ఈరోజు రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version