రాష్ట్రం లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఇవాళ ఒక మోస్తరు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఇదిలా ఉంటే ఉపరితల ద్రోణి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు స్థిరంగా ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.
అంతే కాకుండా బంగాళా ఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అలాగే కొనసాగుతున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే తెలంగాణ లో ఏడాది వర్షాలు పుష్కలంగా కురిశాయి. దాంతో వాగులు వంకలు నిండిపోయాయి. ఇక నిన్న కూడా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లోనూ నిన్న కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షం కురిసింది.