పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ ల మధ్యన జరుగుతున్న మ్యాచ్ లో సరికొత్త ట్విస్ట్ ఒకటి వచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్ లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసి భారీ టార్గెట్ ను పాకిస్తాన్ ముందు ఉంచింది. రచిన్ రవీంద్ర (108), విలియమ్సన్ (95), ఫిలిప్స్ (41) లు రాణించారు. ఇక పాక్ బౌలర్లలో మహమ్మద్ వసీం ఒక్కడే మూడు వికెట్లు తీసి న్యూజిలాండ్ ను కాస్త అడ్డుకోగలిగాడు. ఇక ఛేదన ఆరంభించిన పాకిస్తాన్ కు ఆరంభంలోనే షఫీక్ (4) రూపంలో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత రెండవ వికెట్ పడకుండా జమాన్ మరియు బాబర్ ఆజామ్ లు చాలా జాగ్రత్తగా మరియు స్కోర్ బోర్డు పడిపోకుండా పరుగులు చేస్తూ వచ్చారు. ఈ దశలో జమాన్ వరల్డ్ కప్ లో మొదటి సెంచరీ (106) ని చేరుకున్నాడు.
ఇక పాక్ 21 .3 ఓవర్ల వద్ద 160 పరుగుల వద్ద ఉండగా బెంగుళూరు లో వర్షం పడడంతో మ్యాచ్ ను నిలిపివేశారు. ఇప్పుడు డక్ వార్త లూయిస్ పద్ధతి ప్రకారం చూస్తే పాకిస్తాన్ 10 పరుగులు ఎక్కువగానే చేసి ముందంజలోనే ఉంది. ఇక వర్షం ఆగకుంటే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ విజయం సాధించి సెమీస్ ఆశలను నిలుపుకుంటుంది.