తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చల్లని కబురు చెప్పారు. రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా పలు జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు పడతాయని చెప్పిన అధికారులు ఆ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు.
రాష్ట్రంలో రేపు (గురువారం జూన్ 27వ తేదీ) కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి , ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, మేడ్చల్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎల్లుండి (శుక్రవారం జూన్ 28వ తేదీ) వనపర్తి, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.