తెలంగాణలో ఈరోజు రేపు కొన్ని ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. నిన్న ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది.
ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈరోజు, రేపు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక మామూలుగా శీతాకాలం కావడంతో ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా నమోదవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నల్లవెల్లిలో అత్యల్పంగా 12.7 డిగ్రీలు, జగిత్యాల జిల్లా మేడిపల్లిలో అత్యధికంగా 36.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందయినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.