రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్‌ న్యూస్..ఎల్లుండి నుంచే రైతు బంధు

-

తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ఇస్తున్న రైతు బంధు కోసం అన్నదాతల ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ పడబోతోంది. సీజ‌న్ మొద‌లైనా పెట్టుబ‌డి సాయం అంద‌క ఇబ్బందులు ప‌డుతున్న రైతుల‌కు సియం కేసిఆర్ తీపి క‌బురు చెప్పారు. యాసంగి సాగుకు రైతుబంధు ఎల్లుండి రైతుల ఖాతాల్లో వేయనున్నారు. రెండు నెల‌ల క్రిత‌మే సీజ‌న్ మొద‌లైనా క‌రోనా త‌ర్వాత ప్రభుత్వ ఆదాయం ప‌డిపోవ‌డంతో నిధుల మంజూరు ఆల‌స్యం అయింది.

raithu
raithu

యాసంగి ఊపందుకోవ‌డంతో ఎకరాలతో సంబంధం లేకుండా రైతు బంధు సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2018 ఖ‌రీఫ్ సీజ‌న్ నుంచి తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు ప‌థ‌కం అమ‌లు చేస్తోంది. రైతుల‌కు పెట్టుబ‌డి సాయం కింద ఏడాదిలో ఒక ఎక‌రానికి ప‌దివేల రూపాయ‌ల చొప్పున అందిస్తోంది. ఈ సీజ‌న్‌లో 65ల‌క్షల ఎక‌రాల సాగు ల‌క్ష్యాన్ని పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. భూమి ఉన్న రైతులు సాగు చేసినా చేయ‌క‌పోయినా మొత్తం విస్తీర్ణానికి రైతుబంధు ఇవ్వాల‌ని కూడా నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Latest news