శిల్పశెట్టి భర్త పోర్న్‌ కేసు : ఒక్క రోజు ఆదాయం ఎంతో తెలుసా !

శిల్పశెట్టి భర్త రాజ్‌కుంద్రా పోర్న్‌ కేసులో అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే…రాజ్‌కుంద్రా పోర్న్‌ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. హాట్‌షాట్‌కు రాజ్‌కుంద్రానే యజమాని అని తేల్చిశారు ముంబై పోలీసులు. ఇక గత రెండేళ్ల కాలంలో భారీగా ఆదాయం సంపాదించుకున్న రాజ్‌కుంద్రా… ముంబై పరిసర ప్రాంతాల్లో నీలి చిత్రాలను షూట్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఇండియన్‌ పోలీసులకు చిక్కకుండా వీ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా వీడియోలను రాజుకుంద్రా ఆప్‌లోడ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. నటీమణిల హాట్‌పిక్స్‌, షార్ట్‌ఫిల్స్‌ హట్‌ వీడియోలను హాట్‌షాట్‌ ద్వారా పంపేవాడు రాజ్‌కుంద్రా. దీంతో హాట్‌షాట్‌కు ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల సభ్యుల ఫాలోయింగ్‌ కూడా ఉన్నట్లు పోలీసులు తేల్చేశారు.

ఈ హాట్‌షాట్‌ ద్వారా గతంలో రోజుకు రూ. 4 లక్షలు రాజ్‌కుంద్రా సంపాదించాడని పోలీసులు తెలిపారు. లాక్‌డౌన్‌లో హాట్‌షాట్‌కు విపరీతమైన క్రేజీ ఉందని… రెండేళ్ల నుంచి ప్రతిరోజు రూ.50 లక్షల ఆదాయాన్ని రాజ్‌కుంద్రా రాబట్టినట్లు తేల్చేశారు. ఇక ఈ కేసులో రాజ్‌కుంద్రాతో పాటు 11 మందిని అరెస్ట్‌ చేశారు పోలీసులు