అలర్ట్‌ : రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

ఐఎండి సూచనల ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 7.6 కిమీ ఎత్తు వరకు కొనసాగుతూ నైరుతి దిశగా వంపు తిరిగి వుంది. దీని ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ రోజు విస్తారంగా వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడ్డాయి.

ఇక అటు ముఖ్యంగా రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ఇక అల్పపీడనం కారణంగా రేపు, ఎల్లుండి కూడా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే… తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వేగంతో గాలులు సముద్రం అలజడిగా ఉంటుందని… మత్స్యకారులు శనివారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విపత్తుల శాఖ కూడా హెచ్చరించింది. ఇక అటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో..అన్ని జిల్లాల అధికారులను సీఎం కేసీఆర్‌ అప్రమత్తం చేశారు.